Search This Blog

Wednesday, June 10, 2015

బ్రేక్ ఫాస్ట్‌లో బెర్రీస్, గుడ్లు, పెరుగు తీసుకోండి

సమ్మర్ స్పెషల్ :బ్రేక్ ఫాస్ట్‌లో బెర్రీస్, గుడ్లు, పెరుగు తీసుకోండి







వేసవి కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో ప్రోటీనులు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆ రోజంతటికి శక్తినిచ్చేలా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకోసం బెర్రీస్, గుడ్లు, పెరుగు వంటివి తీసుకుంటే రోజంతటికి సరిపడా శక్తి లభిస్తుంది.
 
బ్రెర్రీస్‌ను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా ఆ రోజంతా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా యాక్టివ్‌గా ఉంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉన్నాయి. ఇంకా క్యాలరీలు తక్కువ న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి.
 
ఇకపోతే.. పెరుగులో ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ అధికం. జీర్ణం అవ్వడానికి చాలా సులభంగా పనిచేస్తాయి. అలాగే వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల వేసవికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది. రోజంత ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు పెరుగు బెస్ట్ ఫుడ్‌.  
 
అలాగే గుడ్లలో ప్రోటీన్స్, విటమిన్స్, మినిరల్స్ అధికం. ఉదయం గుడ్డు తినడం వల్ల, ఆరోజంతటికి అవసరం అయ్యే ఎనర్జీని నిధానంగా విడుదల చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం చాలా మంచిది. వేసవిలోనే కాకుండా ఇతర సీజన్లలోనూ అల్పాహారంలో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

@adsbygoogle